Nandamuri Balakrishna | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆదిత్య 369 (Aditya 369) ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అలరించారు.
అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ ఒక నెల ముందుగానే విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 04 రీ రీలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహిని హీరోయిన్గా నటించగా, అమ్రిష్ పూరి, టినూ ఆనంద్, నటుడు తరుణ్ సుత్తివేలు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.
మీ ఉత్సాహం మేం చూసాం…
అందుకే, మీకోసం ఇంకాస్త ముందే వస్తున్నాం 🤩Experience #NBK‘s Timeless Classic, #Aditya369 4K re-release in theaters on 4th April 🌐
Nata🦁#NandamuriBalakrishna #SingeetamSrinivasaRao #SPBalasubrahmanyam @ilaiyaraaja #Jandhyala @krishnasivalenk #VSRSwamy… pic.twitter.com/BE7rluXZdf
— Sridevi Movies (@SrideviMovieOff) March 24, 2025