Amitabh Bachchan | ముంబై (Mumbai)లో షూటింగ్‌కు లేటవుతుందనే కారణంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan ) ఇటీవల అపరిచితుడి బైక్‌పై ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో బిగ్‌బీ, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు బిగ్‌బీపై విమర్శలు చేశారు. ‘ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటే.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి’ అంటూ నెటిజన్లు ముంబై ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీంతో బిగ్‌బీకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి పోలీసులు ఫైన్ వేశారు.
ఇదిలా ఉండగా.. అమితాబ్ తాజాగా మరో ఫొటో షేర్ చేశారు. ఓ పోలీసు వాహనం పక్కన దీనంగా నిల్చుని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోకు ‘అరెస్టెడ్..’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన అభిమానులను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘మీరు నిజంగా అరెస్ట్ అయ్యారా..’, ‘బిగ్ బీ జోక్ చేస్తున్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో షూటింగ్లో భాగంగా తెలుస్తోంది.
Also Read..
Virat Kohli | ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యా.. నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను : కోహ్లీ
Cannes 2023 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన బీటౌన్ తారలు
Tsunami | న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు