Odeon Cinemas | హైదరాబాద్ సినీ ప్రేక్షకులను అలరించేందుకు రెండు కొత్త మల్టీప్లెక్స్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి ఓడియన్ సినిమాస్ కాగా.. మరోకటి ఏఎంబీ సినిమాస్.
Amb Cinemas ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫ్రాంచైజీని మరింత ముందుకుతీసుకువెళుతూ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ సినిమాస్‌ని తీసుకురాబోతున్నారు. క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ మాల్కి ఎదురుగా రాబోతున్న ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాతో లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. మొత్తం 7 స్క్రీన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లో ప్రతి ఒక్కటీ అత్యుత్తమ వీక్షణ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు. అత్యాధునిక ప్రాజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన ప్రీమియం సీటింగ్‌తో గచ్చిబౌలి ఏఎంబీని మించిన స్థాయిలో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం.
Odeon Multiplex | ఒకవైపు క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ రాబోతుండగా.. ఈ మల్టీప్లెక్స్ ఎదురుగానే ఓడియన్ మల్టీప్లెక్స్ రాబోతుంది. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాస్ థియేటర్‌గా పేరు తెచ్చుకున్న ఓడియన్ థియేటర్ 2006లో బాంబ్ బ్లాస్ట్ అనంతరం మూతపడిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడున్న థియేటర్‌ను కుల్చేసి మాల్ని నిర్మించారు థియేటర్ నిర్వహాకులు. అయితే ఓడియన్ మాల్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయినప్పటికి ఇందులో మల్టీప్లెక్స్‌ను ఇంకా ప్రారంభించలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఓడియన్ మల్టీప్లెక్స్ కూడా అక్టోబర్ చివరికి లేదా డిసెంబర్లో ప్రారంభం కాబోతుందని సమాచారం. మొత్తం 8 స్క్రీన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లో ప్రతి ఒక్కటీ అత్యుత్తమ వీక్షణ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు నిర్వహాకులు.