Baahubali The Epic | తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల 10 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ రీ రిలీజ్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా (బాహుబలి: ది ఎపిక్) BaahubaliTheEpic అనే పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో రీ ఎడిటింగ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు దర్శకుడు రాజమౌళి. మరోవైపు ఈ సినిమా రన్‌టైంకి సంబంధించి క్లారిటీనిచ్చాడు నిర్మాత శోభు యార్లగడ్డ. ఈ సినిమా రన్‌టైం మొదట 5 గంటల 27 నిమిషాలు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శోభు మాట్లాడుతూ.. బాహుబలి: ది ఎపిక్ 3 గంటల 40 నిమిషాల రన్‌టైం(అటు ఇటుగా)తో రాబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే బాహుబలి పార్ట్ 1 ముగిశాక ఇంటర్వెల్ ఉంటుందని ఇంటర్వెల్ అనంతరం పార్ట్ 2 స్టార్టవుతుందని శోభు తెలిపాడు.