Funkey Movie | టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నతాజా చిత్రం ‘ఫంకీ’. వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న విశ్వక్ ఎలాగైన హిట్టు కొట్టాలనే కసితో ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి కామెడీ సినిమాలను తెరకెక్కించిన కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ నటి కాయడు లోహర్ కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ను పంచుకున్నారు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం చిత్ర పరిశ్రమపై సెటైరికల్‌గా తెరకెక్కుతుంది.
Sound. Camera. Laughter! 🔊🎥😄
Get ready for a full-on family entertainer that’s all #FUNKY 😎#FunkyTeaser drops on October 10th. 😉
Mass Ka Das @VishwakSenActor @anudeepfilm #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri #SureshSarangam #MohanSato @SitharaEnts… pic.twitter.com/7ujVQOS4nq
— Naga Vamsi (@vamsi84) October 7, 2025