Maithili Thakur | ‘నేను రాజకీయాలు చేయదల్చుకోలేదు’.. పొలిటికల్ ఎంట్రీపై సింగర్ మైథిలీ ఠాకూర్
Maithili Thakur | తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు.
Maithili Thakur : తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు. మరో నెల రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మైథిలీ ఠాకూర్ తాజాగా తన తండ్రితో కలిసి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినోద్ తావ్డే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలిశారు.
దాంతో మైథిలీ ఠాకూర్ రాజకీయాల్లోకి వస్తున్నారని, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈ విషయంపై ప్రశ్నించగా ప్రజలకు సేవ చేసేందుకు ఆ అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పారు. మైథిలీ ఠాకూర్ అంశంపై వినోద్ తావ్డే కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మైథిలీ ఠాకూర్‌ను ‘బీహార్ మానస పుత్రిక’ గా అభివర్ణించారు. 1995లో లాలూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీహార్‌ను విడిచిపెట్టి వెళ్లిన కుటుంబాలు తిరిగి వస్తున్నాయని, అలాంటి ఓ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే మైథిలీ ఠాకూర్ అని పేర్కొన్నారు.
మైథిలీ ఠాకూర్ బీహారీలకు తన సేవలు అందిస్తారని, ఇక్కడి ప్రజల ఆశయాలను నెరవేరుస్తారని తావ్డే రాసుకొచ్చారు. అయితే తావ్డే స్పందనపై మైథిలీ ఠాకూర్ ఆనందం వ్యక్తంచేశారు. తావ్డే తనను అభినందించడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ముందుగా తనకు రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదని, ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకున్న తర్వాత రాజకీయాలపై ఇష్టం పెరిగిందని చెప్పారు. ‘మధుబని నుంచి పోటీ చేస్తారా.. దర్బంగా నుంచి పోటీ చేస్తారా..?’ తన తల్లిది మధుబని, తండ్రిది దర్భంగా అని.. రెండూ తనకు ఇష్టమేనని, అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

