Mahavatar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్కీ కౌశల్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి మహావతార్ (Mahavatar). అమర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో లార్డ్ పరశురామ పాత్రలో కనిపించబోతున్నాడు విక్కీ కౌశల్. చాలా రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంటెన్స్ యాక్షన్, డ్రామాతో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని విక్కీ కౌశల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ మూవీని వచ్చే ఏడాది స్పెషల్ పూజా సెర్మనీతో మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ అమర్ కౌశిక్, హీరో విక్కీ కౌశల్ నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజా కథనాల ప్రకారం అమర్ కౌశిక్ ఇప్పటికే తన డైట్ ప్లాన్‌లో మార్పులు చేసుకున్నాడు. మరోవైపు విక్కీ కౌశల్ ప్రస్తుతం నటిస్తున్న లవ్ అండ్ వార్ పూర్తి చేసిన తర్వాత అమర్ కౌశిక్ రూట్లోనే వెళ్లనున్నాడట.
లార్డ్ పరశురామ పాత్రకున్న శక్తివంతమైన దైవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని విక్కీ కౌశల్ నాన్ వెజ్‌ను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాడని ఇన్సైడ్ టాక్. అరుణాచల్ ప్రదేశ్‌లోని పరశురాం కుంద్కు సమీపంలో పెరిగిన అమర్ కౌశిక్.. మహావతార్ తన హృదయానికి చాలా దగ్గరైన ప్రాజెక్ట్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మహావతార్ను ముందుగా 2026 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించగా.. తాజా అప్డేట్తో ఈ మూవీ 2027లో విడుదల కావొచ్చని అర్థమవుతోంది.
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం