Amaravathiki Aahwanam | ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నోరోన్హా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahwanam). జీవీకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివ కంఠమనేని, సుప్రిత, హరీష్, అశోక్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన గ్లింప్స్‌లో కీటక మరణం కప్ప జీవనాధారం.. కప్ప మరణం పాము జీవనాధారం.. ఈ సృష్టి మొత్తం జనన మరణ పోరాటం. ఇది ఒక యుద్దం.. ఒకరి గెలుపు మరొకరి అంతం.. అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ లాంచ్ చేశారు. ఈ సారి డైలాగ్స్ లేకుండా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఒళ్లు గగుర్పొడిచే భయానక సన్నివేశాలతో కట్ ట్రైలర్ మూవీ హైప్ క్రియేట్ చేస్తోంది. పద్మనాబ్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
బలమైన కంటెంట్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందని డైరెక్టర్ జీవీకే ధీమా వ్యక్తం చేశాడు. భయాన్ని రేకెత్తించేలా ఉన్న టీజర్ దర్శకుడి టాలెంట్ చూపిస్తుందని.. బలమైన కంటెంట్‌తో వస్తున్న చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని మురళీ మోహన్ అన్నారు.
తెలుగులో హార్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే లైన్లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భయపెట్టించేందుకు రాబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
అమరావతికి ఆహ్వానం టీజర్..
