Allu Sirish | అల్లువారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున తమ్ముడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు నయనిక (Nayanika)తో అల్లు శిరీష్ నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో వీరి పెళ్లి గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ డేట్‌ను అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 6న వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న ఓ పాటతో అల్లు అర్హ, అల్లు అయాన్‌తో కలిసి రీల్ చేస్తూ పెళ్లి తేదీని ప్రకటించారు అల్లు శిరీష్. ‘బాబాయ్ పెళ్లి ఎప్పుడు..?’ అని పిల్లలు అడగ్గా.. ‘మార్చి 6, 2026’ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘సంగీత్ ఎప్పుడు ఉంటుంది..?’ అని ప్రశ్నించగా.. ‘మనం దక్షిణాదివాళ్లం.. అలాంటివి చేసుకోం’ అని చెప్పారు. ఈ రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, శిరీష్-నయనకది ప్రేమ వివాహం. వారిద్దరికీ హీరో నితిన్ భార్య ఏర్పాటు చేసిన ఫంక్షన్లో తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అల్లు శిరీష్ చివరిసారిగా 2024లో విడుదలైన యాక్షన్-కామెడీ ఫాంటసీ చిత్రం ‘బడ్డీ’ లో కనిపించారు.
Also Read..
Harshvardhan Rane | అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటుతోంది.. హీరో చొక్కా చింపేసిన ఘటన వైరల్
Sudeep | సౌత్ ఇండస్ట్రీల మధ్య సహకారం లేదు.. హాట్ టాపిక్‌గా మారిన కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు
Tanuja | బిగ్ బాస్ తర్వాత కూడా మనసులు గెలుస్తున్న తనూజ .. మంచి మనసుకి హ్యాట్సాఫ్