హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తేతెలంగాణ): భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఎన్నికయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జరుగుతున్న బీఎంఎస్ 21వ జాతీయ మహాసభల్లో ఆదివారం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన మల్లేశంను జాతీ య అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మల్లేశం గతంలో బీఎంఎస్ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన ఈఎస్ఐ కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేయడంతోపాటు ప్రస్తుతం ఈపీఎఫ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. మల్లేశం ఎంపికపై బీఎంఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.