టాలీవుడ్ (Tollywood) యువ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తోన్న కొత్త ప్రాజెక్టు ప్రేమ కాదంట (Prema Kadanta). 11/11/2021 తేదీ నా ప్రొఫెషనల్ కెరీర్లో ఉత్తమమైన రోజు. ఎందుకనేది రాబోయే రోజుల్లో మీతో షేర్ చేసుకుంటా. నేను ఓ కారణం వల్ల సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నానంటూ పోస్ట్ చేసిన ట్వీట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇంతకీ ఆ స్పెషల్ ఏంటో అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు శిరీష్. ఏడో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, తన కెరీర్లో ఉత్తమ కథ ఇదేనని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే శిరీష్ ఇలా ట్వీట్ పెట్టి..క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు. మరి ట్వీట్లో పోస్ట్ చేసినట్టుగానే రాబోయే రోజుల్లో ఎలాంటి అప్ డేట్స్ ఇస్తాడో చూడాలి. 2013లో గౌరవం సినిమాతో తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శిరీష్.
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason 🙂
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
2019లో చివరిసారిగా ఏబీసీడీ చిత్రంలో కనిపించాడు. సుదీర్ఘ విరామం తర్వాత అల్లు శిరీష్ చేయబోతున్న కొత్త సినిమా ఏస్థాయిలో క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?