రోడ్డు ప్రమాదంలో గాయపడి..కోలుకుంటున్న టాలీవుడ్ (Tollywood) నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ను అల్లు అర్జున్ (Allu Arjun) పరామర్శించాడు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)కి వెళ్లి సాయిధరమ్ తో మాట్లాడాడు. అతని ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు అల్లు అర్జున్. సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన (సెప్టెంబర్ 10) సమయంలో అల్లు అర్జున్ పుష్ప చిత్రీకరణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఉన్నాడు. సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెంటనే వచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలా నిరాశ చెందాడు. అయితే ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి అందరినీ అప్రమత్తం చేశాడు. పుష్ప షూటింగ్ పూర్తయిన వెంటనే నేరుగా ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ ను కలిశాడు.
స్పోర్ట్స్ బైకు (Sports Bike)పై నుంచి కింద పడ్డ సాయిధరమ్ తేజ్ కు డాక్టర్లు కాలర్ బోన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సాయిధరమ్ తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే వెల్లడించారు.మాధాపూర్-ఖానామెట్ రోడ్డుపై నిర్మాణ రంగ వ్యర్థాలు పేరుకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్దారించిన జీహెచ్ఎంసీ అధికారులు అరబిందో కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ కు ఇప్పటికే రూ.1 లక్ష జరిమానా విధించారు.
After reaching #Hyderabad, Icon StAAr #AlluArjun first visits Apollo hospital to enquire about the health condition of #SaiDharamTej. pic.twitter.com/WfHeVY2J2q
— Manobala Vijayabalan (@ManobalaV) September 16, 2021
సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ (Sports bike) స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే.
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!