Allu Arjun | టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ స్పందించాడు. ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదు. కేసును ఉపసంహరించుకుంటాను. అల్లు అర్జున్ను విడుదల చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో మరి పోలీసులు, కోర్టు ఎలా స్పందిస్తాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
పుష్ప-2 సినిమా స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని అతని తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేశామని, అల్లు అర్జున్ను కూడా రిమాండ్ చేశామని విచారణ సందర్భంగా జీపీ కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని జీపీ వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను ఏ11గా చేర్చారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
“I am ready to withdraw the case. I was not aware of the arrest and ALLU ARJUN HAS NOTHING TO DO with the stampede in which my wife passed away”, says Revathi’s husband, Bhaskar.#WeStandWithAlluArjun #AlluArjunArrest pic.twitter.com/3rojgDjMOa
— Sri Tej (@Alluarjuncult83) December 13, 2024
Mohan Babu | కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు..స్టేట్మెంట్ రికార్డ్..!
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ
Daaku First Single | డేగ డేగ డేగ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ డాకు మహారాజ్ సాంగ్ ప్రోమో