Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో .. ఆయన గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) కూడా అంతే ఫేమస్. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అవి చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతుంటారు. వీడియోల్లో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటుంది.
తాజాగా అర్హపై ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు ఈ ఐకాన్ స్టార్. ‘అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్’ అంటూ పుష్ప చిత్రంలోని పుష్పరాజ్ స్టైల్లో రాసుకొచ్చారు. ఈ మేరకు కుమార్తెతో ఉన్న క్యూట్ ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05 వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప-2లో (Pushpa 2) రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నది. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read..
Suriya 45 | మూడోసారి.. సూర్య, త్రిష కాంబినేషన్ వన్స్‌మోర్..!
AR Rahman Networth | ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు