AR Rahman Networth | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన భార్య సైరా భానుతో విడిపోయారు. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ప్రకటించారు. విడాకులపై అడ్వకేట్ సమాచారం అందించారు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ ఆస్తులపై చర్చ సాగుతున్నది. ప్రస్తుతం అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయ సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. రికార్డ్ ప్లేయర్‌గా తొలిసారిగా రూ.50 పారితోషకం అందుకున్న ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నికర సంపద రూ.1700కోట్లు. రోజా మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రెహమాన్.. ఆ సమయంలో రూ.25వేలు అందుకున్నాడు. లైఫ్ స్టయిల్ ఆసియా నివేదిక ప్రకారం.. స్లమ్‌డాగ్ మిలియనీర్‌కు ఆస్కార్‌ను అందుకున్న రెహమాన్ నికర ఆస్తుల విలువ 200 నుంచి 400 మిలియన్ డాలర్లు.
భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.1700కోట్లు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు స్వరాలు సమకూర్చేందుకు రెహమాన్ దాదాపు రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఆయన కేవలం ఒక పాట కోసం రూ.3కోట్ల వరకు వసూలు చేయనున్నారు. అంతేకాకుండా ఆయన లైవ్‌షోలు సైతం చేస్తుంటారు. దాంతో భారీగానే ఆదాయం ఆర్జిస్తున్నారు. ఒక్కో గంటకు దాదాపు రూ.కోటి నుంచి రూ.2కోట్ల వరకు వసూలు చేస్తారు. రెహమాన్‌కు భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ బంగ్లాలు ఉన్నాయి. భారత్‌లో చెన్నైతో బంగ్లాతో పాటు అమెరికాలోని లాస్ ఏంజిల్స్, దుబాయిలో ఇండ్లు ఉన్నాయి. వోల్వో ఎస్యూవీ, జాగ్వార్, మెర్సిడెజ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది. కుమార్తెలు ఖతీజా, రహీమా వద్ద రూ.1.5కోట్ల విలువైన ఎలక్ట్రిక్ పోర్స్చే టైకాన్ కార్లు ఉన్నాయి.