పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). అప్పటివరకు దక్షిణాదికే పరిమితమైన ఈ హీరో పుష్ప (Pushpa) సినిమాతో పాపులారిటీ అమాంతం పెంచేసుకున్నాడు. హిందీ మార్కెట్లో మంచి బిజినెస్ చేసింది పుష్ప. ఇపుడు సీక్వెల్ పార్టు పుష్ప 2 చేసేందుకు రెడీ కూడా అవుతున్నాడు. ఇదిలా ఉంటే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
చాలా రకాల బ్రాండ్ల ప్రమోషనల్ ఆఫర్స్ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నాయట. అందులో ఓ కంపెనీ ఇచ్చిన భారీ ఆఫర్‌ను బన్నీ పక్కన పెట్టాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ కంపెనీ ఎంటనుకుంటున్నారా..? పొగాకు ఉత్పత్తుల కంపెనీ (Tobacco company) నుంచి భారీ ఆఫర్ వచ్చినా..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిరస్కరించాడట. అల్లు అర్జున్ పొగత్రాగడని తెలిసిందే. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల ప్రమోషన్‌కు మొదటి నుంచి దూరంగా ఉంటాడు.
అల్లు అర్జున్ నిర్ణయంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. పాపులారిటీ, క్రేజ్ రోజురోజుకీ పెరుగుతున్నా..ఏ మాత్రం అడ్వాన్స్ అవకుండా విలువలకు కట్టుబడి ఉన్న బన్నీ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్, ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. బన్నీ ఇప్పటికే ఆన్లైన్ బైక్ ట్రావెల్ సర్వీస్ ర్యాపిడోను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.