Pushpa 2 The Rule | ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తోంది. పుష్ప 2 ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్లకు పైగా వసూలు చేసి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన (జాతీయ) చిత్రంగా తన హోదాను పదిలం చేసుకుంది.
పుష్ప 2 ది రూల్ 45 రోజుల తర్వాత కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. అదనంగా పుష్ప 2 కోసం 20 నిమిషాల ప్రత్యేక కంటెంట్‌తో కూడిన రీలోడెడ్ వెర్షన్ ఇటీవల థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌కు కూడా అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్‌లోని ఐకానిక్ సంధ్య 70 MM థియేటర్ స్క్రీనింగ్ రన్లో 45వ రోజున అద్భుతమైన ఫీట్‌ను నమోదు చేసింది.
పుష్ప 2 ది రూల్ రెండో షో టికెట్స్ పూర్తిగా అమ్ముడైపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఈ షోకు 1,323 సీట్లు నిండిపోయాయి. నెలన్నర తర్వాత కూడా ఓ సినిమా హౌస్‌ఫుల్ షో సాధించడం అరుదైన విషయమనే చెప్పాలి. ఈ అప్డేట్ పుష్ప 2కి ఎలాంటి క్రేజ్‌ను ఉందో మరోసారి రుజువు చేస్తుంది. సీక్వెల్‌కు అదనంగా యాడ్ చేసిన 20 అదనపు పుటేజీని ఓ మాస్టర్‌స్ట్రోక్‌గా అభివర్ణిస్తున్నారు మేకర్స్. పుష్ప 2 ఓటీటీ విడుదలకు కొన్ని రోజుల ముందు నమోదు చేసిన ఈ ఫీట్ టీంతోపాటు మూవీ లవర్స్‌లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఈ మూవీలో కన్నడ సోయం రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. షణ్ముఖ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, సామ్ సిఎస్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
#Pushpa2TheRule DAY 45 – 2nd Show – Sandhya 70MM – 1323/1323 TICKETS SOLD OUT!! 🔥🔥🔥#Pushpa2Reloaded RAMPAGE!!! 💥🤙 pic.twitter.com/Y0KovIl7tq
— Pushpa (@PushpaMovie) January 18, 2025
Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!