Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). ఈ ప్రాంచైజీ మూవీని సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతుందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ విషయమేంటంటే.. బన్నీ అభిమానులు వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్లో అల్లు అర్జున్ భారీ కటౌట్‌ను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 16×108 అడుగుల కటౌట్‌ను నిర్మిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్దది కావడం విశేషం. భారీ కటౌట్‌తో సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటుండగా.. ఆ కటౌట్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు