సాధారణంగా స్టార్ హీరో సినిమా విడుదల వుంది అంటే రెండు వారాల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఇక ఆ సినిమాపై వున్న క్రేజ్‌ను బట్టి ఆ సినిమా ప్రారంభ వసూళ్లు ఆధారపడి వుంటాయి. అయితే విడుదలకు 100 రోజుల ముందే నుంచే బుక్‌మై షో (Book My Show) యాప్‌లో దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇంట్రెస్ట్‌గా వున్నామని క్లిక్ చేస్తే.. అది పుష్ప-2 సినిమా అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని క్రేజ్, బజ్ పుష్ప-2 సంతరించుకుంది.
అందుకే విడుదలకు ముందే ఈ సినిమా టిక్కెట్ల కోసం మూడున్నర లక్షల మంది బుక్‌మై షోలు ఇంట్రెస్ట్‌గా వున్నట్లుగా తమ క్లిక్స్ ద్వారా తెలియజేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప దిరైజ్కు సీక్వెల్‌గా రూపొందుతున్న పుష్ప-2 దిరూల్(Pushpa 2 The Rule) చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రం డిసెంబర్ 6న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన పుష్ప.. పుష్పరాజు అనే టైటిల్ సాంగ్‌తో పాటు సూసేటి అగ్గిరవ్వ అనే కపుల్ సాంగ్ ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా నుంచి ఎటువంటి పోస్టర్ విడుదలైన ప్రమోషన్ అప్డేట్ వచ్చిన అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి అద్భుతైమన క్లైమాక్స్‌ను దర్శకుడు సుకుమార్(Sukumar) ప్లాన్ చేశాడని సమాచారం. ఇటీవల మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్.. ఈ క్లైమాక్స్ ఎలా వుండబోతుందనే లీకులు కూడా ఇచ్చేశాడు..
ఒకవైపు షూటింగ్…. మరోవైపు పోస్ట్ ప్రొడక్ష్‌న్ పనులు జరుపుకుంటోన్న పుష్ప-2 చిత్రం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే కొత్త రికార్డులు సొంతం చేసుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల తరువాత కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో… వెయిట్ అండ్ సీ..
Read Also
Swag Teaser | శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో.. ఆకట్టుకుంటున్న ‘స్వాగ్’ టీజర్