Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటూ అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నిని ప్రశ్నించారు.
అడ్వొకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు..? రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. దాదాపు 20కిపైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్ని సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సినీనటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీస్ ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు స్పందించిన బన్ని.. ఇవాళ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. తన తండ్రి అల్లు అరవిరంద్, మామ చంద్రశేఖర్ పీఎస్‌కు వెళ్లారు.
Also Read..
Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. మళ్లీ అరెస్టు చేస్తారా?
Allu Arjun | అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశం