Allu Arjun | కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. గత మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడ్ విలయంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. బన్ని తన వంతు సాయంగా రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాడ్ ఘటన తనని కలచి వేసిందన్నారు. కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని చెప్పారు. అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మలయాళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కేరళలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ కూడా రూ.5 లక్షలు సాయం ప్రకటించింది. కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్ దంపతులు రూ.20 లక్షలు విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Also Read..
Bharateeyudu 2 | ఓటీటీలోకి ‘భారతీయుడు 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Man shot dead | చండీగఢ్ కోర్టులో హత్య ఘటన.. కుటుంబ తగాదాలే కారణం..!