Allu Arjun | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఓపెనింగ్ డే నుంచి నేటి వరకు వసూళ్ల వర్షంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ చిత్రం కేవలం 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై రికార్డ్ వసూళ్లతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ టీం ఢిల్లీకి పయనమైంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయాన్నే తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. ఎంత అందమైన ఉదయం.. బిగ్ డే.. అందమైన ప్రారంభం.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
అద్భుతమైన విజయాన్ని అందుకున్న కొడుకును చూసి నిర్మల గర్వంగా ఫీలవుతూ సంతోషంలో కనిపించగా.. మరోవైపు తన తల్లిని చూసి ఆనందంలో మునిగిపోయాడు బన్నీ. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో వచ్చిన సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
అమ్మతో హ్యాపీగా..
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!