మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ (Mallemaala Entertainments) షో ఢీ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఢీ 13 వ (Dhee 13 Kings vs Queens) సీజన్ నడుస్తోంది. ఈ షో గ్రాండ్ ఫినాలేకు పుష్పరాజ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆ గెస్ట్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఢీ 13వ గ్రాండ్ ఫినాలేలో సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలవగా ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.
ఫినాలే ఎపిసోడ్ బుధవారం రాత్రి 9.30 గంటలకు (డిసెంబర్ 8న) ప్రసారం కానుంది. కావ్య శ్రీ, కార్తిక్ ఫినాలేలో పోటీ పడనున్నారు. మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్, రామ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కావ్య శ్రీ తమ టాలెంట్‌ను చూపించబోతున్నారు. ఈ క్రేజీ షోకు ప్రియమణి, పూర్ణ, గణేశ్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీగౌతమ్, దీపిక పిల్లి టీం లీడర్లు. ఈ మెగా ఎపిసోడ్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో