Flydubai | ఆ టెర్రరిస్టు కోపైలట్‌కు మరణశిక్ష విధించాలి : యూఏఈ
Flydubai | ఫ్లైదుబాయ్ విమానం (Flydubai flight) లో భారత్‌కు చెందిన పైలట్ (Indian Pilot) స్మిత్ మచ్చర్ (Smit Macchar) పై దాడిచేసి, విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించిన కో-పైలట్ (Co-Pilot) హమామ్ అల్-హమ్మామీ (Hamam Al Hammami) కి మరణశిక్ష విధించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కోరుతున్నది.
Flydubai : ఫ్లైదుబాయ్ విమానం (Flydubai flight) లో భారత్‌కు చెందిన పైలట్ (Indian Pilot) స్మిత్ మచ్చర్ (Smit Macchar) పై దాడిచేసి, విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించిన కో-పైలట్ (Co-Pilot) హమామ్ అల్-హమ్మామీ (Hamam Al Hammami) కి మరణశిక్ష విధించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కోరుతున్నది. ఈ ఘటనను తీవ్రమైన ఉగ్రవాద చర్య (Terror Act) గా అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు. నిందితుడైన కో-పైలట్‌కు అత్యంత కఠినశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కూడా వాదిస్తున్నారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్ 1073 విమానంలో దారుణం జరిగింది. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ హమామ్.. విమానంలోని గొడ్డలి తీసుకుని పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడికి పాల్పడ్డాడు. అనంతరం విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని కూల్చివేయాలని ప్రయత్నించడంతో విమానం ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ చాకచక్యంగా కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దాంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై యూఏఈ అధికారులు విచారణ చేపట్టారు. సౌదీ అరేబియాలో అదుపులోకి తీసుకున్న 29 ఏళ్ల ఒమన్ జాతీయుడైన అల్-హమ్మామీని యూఏఈకి తరలించారు. విచారణలో తాను విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని, చావంటే తనకు భయం లేదని అల్-హమ్మామీ అంగీకరించినట్లు సమాచారం. గతంలో ఒమన్ ఎయిర్ లైన్స్‌లో పనిచేసినప్పుడు కూడా తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడన్న కారణంతో అతన్ని విధుల నుంచి తొలగించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో యూఏఈకి ఇజ్రాయెల్ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. విమాన ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుడికి అత్యంత కఠినశిక్ష అయిన మరణశిక్ష విధించాలని యూఏఈ ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

