12A Railway Colony | టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న థ్రిల్లర్ ప్రాజెక్ట్ ‘12A రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లరి నరేశ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
కాగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా థియేటర్లలోకి రాకముందే ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియో భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. థియాట్రికల్ రన్ తర్వాత మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు.
12A రైల్వే కాలనీలో సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ ఫేం డాక్టర్ అనిల్విశ్వనాథ్ కథ, స్కీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు.
కామెడీ సినిమాలు చేయకపోవడంపై అల్లరి నరేశ్ ఏమన్నాడంటే..?
ఎక్కువగా కామెడీ సినిమాలెందుకు చేయడం లేదని ప్రమోషన్స్‌లో అల్లరి నరేశ్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి అల్లరి నరేశ్ స్పందిస్తూ.. కామెడీ సినిమాలు తీయాలంటే ఇప్పుడు చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. మేం ఒకవేళ ఇప్పుడు కితకితలు చేస్తే.. బాడీ షేమింగ్‌తో సినిమాను పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా సున్నితంగా మారాయి.
కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశముంది. ఈ రోజుల్లో మనం కలర్, బరువుతోపాటు ఇతర సున్నిత అంశాలపై మాట్లాడకూడదన్నాడు అల్లరి నరేశ్. ప్రేక్షకుల అభిరుచి ప్రతీ పది సంవత్సరాల కోసారి మారుతూ వస్తుంది. నేను గతంలో రైమింగ్ డైలాగ్స్, కౌంటర్స్‌తో సాగేకామెడీ సినిమాలు చేసేవాడిని. సుడిగాడు స్పూఫ్ సినిమా.
ప్రేక్షకులు కూడా ప్రతీ కంటెంట్‌పై స్పూఫ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జోకులు ఖచ్చితంగా ఆర్గానిక్‌గా ఉండాలి. వాటిని సోషల్ మీడియా మీమ్స్‌ను నుంచి అస్సలు కాపీ చేయొద్దు. జనాలు ఇప్పుడు ఆర్గానిక్‌గా ఉండే సెన్సిబుల్ కామెడీని ఆశిస్తున్నారని చెప్పుకొచ్చాడు అల్లరి నరేశ్.
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!