NTR Neel | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. కేజీఎఫ్, సలార్ ప్రాంఛైజీలతో గ్లోబల్ వైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ (PrashanthNeel) డైరెక్షన్లో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్ 31 (NTR 31). ముందుగా వచ్చిన వార్తల ప్రకారం NTR Neelగా రాబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమానికి అంతా సిద్దమైంది.
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ సెర్మనీకి ఏర్పాట్లు చేశారు. ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ సినీ కెరీర్ థీమ్ ఫొటోలతో డిజైన్ చేసిన స్క్రీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇక స్టూడియో బయట తారక్, ప్రశాంత్ నీల్ కటౌట్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తారక్ ప్రస్తుతం దేవర షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దేవర రెండు పార్టులుగా వస్తుండగా.. పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్టీఆర్ 31 (NTR 31) లాంచ్ అవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయి.
ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ సలార్ సీక్వెల్ సలార్ 2 పనులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మరోవైపు తారక్ వార్ 2 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్‌ను బట్టి ఎన్టీఆర్ 31 రెగ్యులర్ షూటింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం.
NTR- Prasanth Neel Movie opening today #NTRNeel 🔥 pic.twitter.com/hPTxpBB15i
— H A N U (@HanuNews) August 9, 2024
మరి కొద్ది క్షణాల్లో @tarak9999 అన్న దర్శనం ♥️🫂@tarak9999 #JrNTR #NTRNeel #PrashanthNeel #NTR31 #NTRNeelMASSiveLaunch pic.twitter.com/Z9j62EvB6I
— poorna_choudary (@poornachoudary1) August 9, 2024
Ready ready ❤️🔥@tarak9999 #JrNTR #NTRNeel #PrashanthNeel #NTRNeelMASSiveLaunch pic.twitter.com/s6HbLF0izd
— poorna_choudary (@poornachoudary1) August 9, 2024
Hari Hara Veera Mallu | గెట్ రెడీ.. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ యాక్టర్
Pushpa 2 The Rule | లుంగీలో షెకావత్ ఐపీఎస్.. ఫహద్ ఫాసిల్ పుష్ప ది రూల్ లుక్ అదిరిందంతే..!