గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 12:20:07

షూటింగ్స్‌కి సిద్దంగా లేనంటున్న అలియా భ‌ట్..!

షూటింగ్స్‌కి సిద్దంగా లేనంటున్న అలియా భ‌ట్..!

క‌రోనా ఎఫెక్ట్‌తో మూడు నెల‌ల నుండి షూటింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ షూటింగ్స్ జ‌రిపేందుకు ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ తాను ఇప్ప‌ట్లో షూటింగ్స్‌లో పాల్గొన‌లేన‌ని ఖ‌రాఖండీగా చెబుతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ విష‌యంలో అభిమానుల‌లో సందేహాలు నెల‌కొన్నాయి.

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కి క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ నుండి మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌పాలని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో అలియా భ‌ట్ ఇప్ప‌ట్లో షూటింగ్స్ లో పాల్గొన‌లేనని చెప్ప‌డంతో చిత్ర యూనిట్ కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.  అలియా ప‌లు హిందీ చిత్రాల‌లో కథానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo