Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) లీడ్ రోల్లో నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు.
ఈ ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా ఈ సినిమాను బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు నెట్టింట వార్తలు రౌండప్ చేశాయి.
పాపులర్ ఫిల్మ్ మేకర్ అనీష్ బజ్మీ ఈ రీమేక్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనుండగా.. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించనున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
అక్షయ్ కుమార్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీ రీమేక్ చేయడం లేదని ఓ కథనం తాజాగా తెరపైకి వచ్చింది. ఓ సినిమా లవర్‌గా అక్షయ్ కుమార్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూశాడని, అతనికి రీమేక్‌లో నటించాలనే ప్లాన్స్ ఏం లేవని తాజాగా కొత్త అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అక్షయ్ కమార్, అనీశ్ బజ్మీ తరచూ కలుసుకుంటున్పటికీ వీరిద్దరూ వేరే ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారట.
ఈ నేపథ్యంలో మరి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్నిహిందీలో రీమేక్ చేస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ Haiwaan, Bhagam Bhaag 2, Welcome To The Jungle, Hera Pheri 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.