Akshay Kumar | బాలీవుడ్లో అత్యధికంగా ఆదాయం పన్ను చెల్లిస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. అయితే, మరోమారు దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పన్ను చెల్లించిన వారిలో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచాడని సమాచారం. ఇందుకు ఆయన్ను గౌరవించాలని ఆదాయం పన్ను విభాగం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్కు హానరరీ సర్టిఫికెట్ కూడా ప్రదానం చేయాలని ఐటీ విభాగం సిద్ధమైనట్లు ఇంటర్నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన్ను ద్వేషించే వారు.. అక్షయ్ కుమార్ నిజాయితీని గమనించాలని సూచిస్తున్నారు.
`ఆయన్ను ద్వేషించే వారి అంచనా ప్రకారం ఆయన గ్లోబల్ సూపర్ స్టార్ కాదు.. ఆయన కెనడియన్. చాలా కార్యక్రమాల్లో ఉంటారు. కానీ, గత ఐదేండ్లుగా బాలీవుడ్ నుంచి అత్యధికంగా ఆదాయం పన్ను చెల్లిస్తున్న వారు. అందుకే ఆయన నా సూపర్ స్టార్` అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.
మరో నెటిజన్ స్పందిస్తూ `బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లింపుదారుడిగా పేర్కొంటూ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ను సన్మానిస్తూ సమ్మాన్ పత్రాన్ని అందచేసింది. ఆయన్ను కెనడియన్ అని ద్వేషించే వారు.. ఈ సంగతి తెలుసుకోవాలి` అని తెలిపాడు.
ఇదిలా ఉంటే, వచ్చేనెల 11న థియేటర్లలో విడుదల కానున్న రక్షా బంధన్ సినిమాలో భూమి పెడ్నెకర్తో కలిసి నటించాడు. హిమాంశు శర్మ, కనిక ధిల్లాన్ రాసిన ఈ కథకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.