Nandamuri Balakrishna | నేడు (సెప్టెంబర్ 20న) దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు (Akkineni Nageswara Rao) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మూవీ లవర్స్తోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సందేశాన్ని అందరితో పంచుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం.
మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఏఎన్ఆర్ పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి యాక్టర్లందరికీ మార్గదర్శకం. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం..నాటకరంగం నుండి చిత్రరంగం వరకు ఏఎన్ఆర్ చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఇవాళ మనమందరం ఆయనకు నివాళి అర్పిస్తూ.. ఏఎన్ఆర్ నటన, కృషి, పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందామన్నాడు బాలకృష్ణ.
ఇప్పటికే 100వ జయంతిని పురస్కరించుకొని ఏఎన్ఆర్ క్లాసికల్ చిత్రాలను గుర్తు చేసుకుంటూ.. ఆయన కెరీర్లో మరుపురానివిగా నిలిచిపోయిన ఐకానిక్ సినిమాలను రీరిలీజ్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Fondly remembering the legendary #AkkineniNageswaraRao garu on his 100th birth anniversary 🙏#NandamuriBalakrishna garu penned a heartfelt note, honoring the icon’s immense contribution to Indian cinema.
His note stands as a tribute to the man who not only entertained but… pic.twitter.com/aPDDmjs7Ln
— Teju PRO (@Teju_PRO) September 20, 2024
రీరిలీజ్ కాబోయే ఏఎన్ఆర్ చిత్రాలివే..
దేవదాసు (1953), మైసమ్మ (1955), మాయా బజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | గోవా నుంచి హైదరాబాద్కు జానీ మాస్టర్..
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?