Mass Movie Re Release | టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మురారి సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాకుండా మూసిఉన్న థియేటర్లను తెరిపించాయి. అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి మరో హీరో సినిమా రాబోతుంది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగష్టు 29. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున మూవీని రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. అయితే వారికి గుడ్ న్యూస్ అందిస్తూ.. సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ సినిమాను కింగ్ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 28న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జ్యోతిక హీరోయిన్గా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అన్న నడిచొస్తే మాస్.. అన్న నించుంటే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మ మ మాస్ అంటూ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఛార్ట్ బస్టర్‌గా నిలవడమే కాకుండా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read..