టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా చిత్రం బంగార్రాజు (Bangarraju). యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. నాగ్ ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదల తేదీపై నెలకొన్న డైలామాపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టేనని తాజా అప్ డేట్ తో తెలిసిపోతుంది. బంగార్రాజు టీం జనవరి 15న రిలీజ్ డేట్ను ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం కాగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ ప్రాజెక్టులో నాగచైతన్య జూనియర్ బంగార్రాజుగా సందడి చేయనున్నట్టు ఇప్పటికే రిలీజైన టీజర్ ద్వారా తెలిసిపోతుంది. బంగార్రాజు, జూనియర్ బంగార్రాజు ఇద్దరూ పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించడం ఖాయమని ఇప్పటికే విడుదలైన రషెస్ చెబుతున్నాయి.
ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. నాగచైతన్యకు జోడీగా కోలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు