Isha Trailer | ఇటీవలే లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు బన్నీవాస్, వంశీ నందిపాటి. ఈ కాంబో తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. రాజు వెడ్స్ రాంబాయి ఫేం అఖిల్రాజ్తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో హెబ్బాపటేల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రాన్నిడిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ జానర్లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. సినిమా రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది.
మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ప్రేక్షకులు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబ్లూ పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. ‘ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..’ అంటూ ఆయన విసిరే ఛాలెంజ్ తో వీరు ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్‌కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్‌లో సాగాయి. ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్ ని ఎలివేట్ చేశాయి.
కెమెరామెన్ సంతోష్ లైటింగ్ వాడిన విధానం, దానికి ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి. సౌండ్ డిజైన్ హార్రర్ సినిమాలకు ఎంత ముఖ్యమో ఈ సినిమా సౌండ్ డిజైనింగ్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందేమో అనిపిస్తుంది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ చివరలో వచ్చే ట్విస్ట్ లు, ఫాస్ట్ కట్స్ సినిమా మీద ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశాయి. ఒక పక్కా హార్రర్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు అంతకు మించి సమ్థింగ్ను ఈ సినిమా అందించబోతున్నాయని ట్రైలర్ చూసిన అందరూ అంటున్నారు.
‘ఈషా’ ట్రైలర్..
Ajay Bhupati | అజయ్ భూపతి – జయకృష్ణ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!