Trisha | సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి అజిత్ కుమార్-త్రిష (Trisha). ఇప్పటికే నాలుగు సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు ప్రస్తుతం విదాముయూర్చి (Vidaa Muyarchi)లో నటిస్తున్నారని తెలిసిందే. ఏకే 62గా వస్తోన్న ఈ మూవీకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) నటిస్తోన్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఎవర్ గ్రీన్ పెయిర్ ఆరోసారి జతకట్టబోతుందన్న గాసిప్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏకే 63 చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చేస్తున్నాడని తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో యాక్షన్ కామెడీ నేపథ్యంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో కూడా హీరోయిన్గా త్రిషనే ఫైనల్ చేశారట.
ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇదే నిజమైతే త్రిష-అజిత్‌కుమార్ కలయికలో రాబోతున్న ఆరో సినిమా కానుందన్నమాట. మరి త్రిష టీం రాబోయే రోజుల్లో దీనిపై ఏదైనా అధికారిక అప్డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
సూర్య మనోజ్ వంగల డైరెక్షన్లో త్రిష నటించిన వెబ్ సిరీస్ బృంద (Brinda) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించిన ఈ తెలుగు వెబ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. త్రిష మరోవైపు టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తోన్న విశ్వంభరలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుడగా.. షూటింగ్ దశలో ఉంది.
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం