Good Bad Ugly | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకడు అజిత్ కుమార్ (Ajith kumar). అజిత్ నటిస్తోన్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. చాలా కాలంగా కొత్త అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఫొటో రూపంలో వార్తను షేర్ చేసింది అజిత్ కుమార్ టీం.
అజిత్‌కుమార్, యోగిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌తో షూటింగ్ లొకేషన్లో దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అజిత్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా.. ? షూట్ కోసం యూరోపియన్ కంట్రీ బల్గేరియాకు వెళ్లింది. గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కామెడీ సెన్సేషన్ యోగిబాబు, అజిత్ కుమార్‌తో అధిక్ రవిచంద్రన్ ఎలాంటి సన్నివేశాలు రెడీ చేస్తున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2025 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహాం పేర్లు తెరపైకి రాగా.. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారనేది క్లారిటీ రావాల్సి ఉంది.
#GoodBadUgly : YogiBabu On Board🔥
Stars : Ajith Kumar – Yogi Babu
Music : Devi Sri Prasad (Kanguva)
Direction : Adhik Ravichandran (TIN – Mark Antony)SUMMER 2025 Release Plans!! pic.twitter.com/7AUPmaTyvd
— Saloon Kada Shanmugam (@saloon_kada) November 18, 2024
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్