Valimai movie | కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీలో కూడా వాయిదాల పర్వమే నడుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తుండటంతో నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీలను మార్చుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో సంక్రాంతికి రావల్సిన ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. 1000 కోట్లు జరుగుతుంది అనుకున్న బిజినెస్ కాస్తా 100 కోట్లకు పడిపోయింది. ఇంకా చెప్పాలంటే 100 కోట్లు కూడా లేదు. ఇదిలా ఉంటే తమిళనాట కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి.
అందుకే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో.. ఇప్పటి నుంచి థియేటర్లలో కేవలం మూడు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దానికి తోడు నైట్ కర్ఫ్యూ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడం మంచిది కాదు అని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమా కూడా వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. సీహెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకే రోజు తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు.
జనవరి 13న విడుదల తేదీ కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో నిర్మాతలు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు. అయితే ఇంత పెద్ద సినిమాను సంక్రాంతికి ఇలాంటి పరిస్థితుల్లో విడుదల చేయడం అనేది ఏ మాత్రం మంచిది కాదు అని భావిస్తున్నారు నిర్మాతలు. ఏదేమైనా ఇప్పటికే తెలుగు, హిందీలో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అజిత్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకేం దొరకలేదా..?
Pushpa in OTT | RRR డేట్ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..