Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా ఛీర్ అప్ మూడ్‌లో బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేసిన పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ మూవీ లొకేషన్ స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వైట్ అండ్ వైట్ సూట్లో స్టైలిష్ గాగుల్స్‌తో ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న స్టిల్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో సూపర్ స్టైలిష్ టాలీవుడ్ యాక్టర్ సునీల్ (Sunil) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరమ్ తర్వాత అజిత్‌కుమార్-డీఎస్పీ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సారి తల అజిత్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని చెప్పకనే చెబుతోంది.
#GoodBadUgly – Stylish #Ajithkumar is Back..🤩💥 Fanboy #AdhikRavichandran Sambavam..🔥👌 pic.twitter.com/7WWFaX6dCK
— Laxmi Kanth (@iammoviebuff007) October 9, 2024
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!