The Brain | నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది బ్రెయిన్. సస్పెన్స్, క్రైం కథల కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని తెలిసిందే. ది బ్రెయిన్ కూడా ఇదే జోనర్లో వస్తోంది.
అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి నటిస్తున్నారు. ది బ్రెయిన్ షూటింగ్ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని క్రైం సస్పెన్స్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని డైరెక్టర్ అశ్విన్ కామరాజ్ కొప్పాల. కేసులను ఇన్వెస్టిగేషన్ క్రమంలో సీరియస్‌గా కనిపిస్తున్నట్టు ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
మెదడుకు పుస్తెల తాడు వేలాడుతుండగా.. పైనుంచి మోలను సుత్తెతో మెదడులోకి కొడుతున్న స్టిల్ కంటెంట్‌లో ఏదో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెబుతోంది.
