బాలీవుడ్ (Bollywood)లో సక్సెస్ రేట్ బాగా ఉన్న హీరోల్లో ఒకడు అజయ్ దేవ్గన్ (Ajay Devgan). ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో కీ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో అజయ్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. అంతేకాదు అజయ్ దేవ్గన్ నిర్మిస్తూ..దర్శకత్వం వహించిన కొత్త చిత్రం రన్ వే 34 త్వరలోనే విడుదలకు ముస్తాబవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అజయ్ దేవ్గన్ కూతురు నైసా (Nysa) ఇండస్ట్రీ ఎంట్రీపై రిపోర్టర్లు ప్రశ్నించారు.
దీనిపై అజయ్ స్పందిస్తూ..ఒకవేళ ఆమె ఈ లైన్ (సినిమాల్లోకి) వస్తుందా..? నాకు తెలియదు. ఎందుకంటే ఈ క్షణం వరకు నైసా సినిమాల పట్ల అనాసక్తిగానే ఉంది. పిల్లల విషయంలో ఎప్పుడైనా మార్పు రావొచ్చు. అందువల్లే నాకు తెలియదు. ప్రస్తుతం నైసా విదేశాల్లో చదువుతోందని చెప్పుకొచ్చాడు అజయ్ దేవ్గన్. నైసా చివరగా తల్లి కాజోల్‌తో కలిసి ఫ్యాషన్ షోలో సందడిచేసింది. అయితే ఒకవేళ తన కూతురు నటి అవ్వాలనుకుంటే తాను పూర్తి ఆమెకు సపోర్టు చేస్తానని చెప్పాడు అజయ్ దేవ్గన్.