తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) లీడ్ రోల్లో చేస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). ఫీ మేల్ సెంట్రిక్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ జమున పాత్రలో నటిస్తోంది ఐశ్వర్యా రాజేశ్. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు (Driver Jamuna Trailer) మంచి స్పందన వస్తోంది. కాగా తాజాగా కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది. డ్రైవర్ జమున షూటింగ్ పూర్తయింది. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ అండ్ టీం కేక్ కట్ చేసింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ..త్వరలోనే గ్రాండ్‌గా విడుదల కాబోతుందని ట్వీట్ చేసింది ఐశ్వర్యారాజేశ్. ఈ చిత్రంలో అడుకలమ్ నరేన్, కవితా భారతి, అభిషేక్ కుమార్, ఇలయ పండి, మణికందన్ రాజేశ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఎస్పీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
అవుట్ అండ్ అవుట్ రోడ్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి పీ కిన్స్లిన్ (P Kinslin0 దర్శకత్వం వహిస్తున్నాడు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన వెబ్ సిరీస్ Suzhul: The Vortex సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఐశ్వర్యారాజేశ్.
That’s a wrap 🤗🤗 Can’t wait for u all to cya soon in theatres #driverjamuna
If u haven’t watched d trailer checkout https://t.co/F2njj0k1hb @kinslin @GhibranOfficial @gokulbenoy @SPChowdhary3 pic.twitter.com/uPTfRwPvCg— aishwarya rajesh (@aishu_dil) July 11, 2022