గ్లామర్ పాత్రలే కాదు.. కంటెంట్ బాగుంటే ఇద్దరు పిల్లల తల్లిగా నటించేందుకు కూడా వెనుకాడదు ఐశ్వర్య రాజేశ్. తెలుగమ్మాయే అయినప్పటికీ.. తమిళ సినిమాల్లో ఫేమస్ అయింది ఐశ్వర్య. తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్‌లో సువర్ణ పాత్రలో మెప్పించిన ఈ అమ్మడు అందరితో శభాష్ అనిపించుకుంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ భామ.. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా నోరువిప్పింది. నల్లగా ఉండటం వల్ల ఇండస్ట్రీలో తనని ఎంత చులకనగా చూశారనే విషయాలను బయటపెట్టింది.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు తన రంగు, రూపం, శరీరాకృతిపై ఎంతోమంది బాధపెట్టేలా అవహేళగా మాట్లాడేవారని ఐశ్వర్య రాజేశ్ చెప్పింది. ‘ అవును నాది డార్క్ స్కిన్. నల్లగా ఉండే వాళ్లు నటించలేరా? ప్రతిభను రంగు బట్టి నిర్ణయిస్తారా?’ అని ప్రశ్నించింది. రంగుకు ప్రతిభకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లైంగిక వేధింపులు కూడా ఎదురయ్యాయని.. వాటికి ఒప్పుకోకపోవడంతో అవకాశాలు కూడా ఇచ్చేవారు కాదని చెప్పుకొచ్చింది. అయినా అవన్నీ తట్టుకుని నిలబడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది. పోయిన చోటే వెతుక్కోవాలని అంటారు.. అందుకే సినిమాలకు పనికిరానని ఎగతాళి చేసిన చోటే హీరోయిన్గా నిలబడ్డానని గర్వంగా చెప్పింది. ఇప్పుడు తమిళంలోనే కాదు.. తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాని గుర్తుచేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
సీక్రెట్ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
అమ్మ కోసం ఇన్ఫోసిస్‌లో జాబ్ తెచ్చుకున్నా.. నా కోసం సినిమాల్లోకి వచ్చా : అనన్య నాగళ్ల
పీలగా కనిపిస్తున్న రకుల్.. సెటైర్స్ వేస్తున్న నెటిజన్స్