కనులెందుకో కలిసేనులే..
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్' ఉపశీర్షిక. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది.
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ ఉపశీర్షిక. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పాటల ప్రమోషన్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘కనులెందుకో..’ బుధవారం విడుదలైంది. చైతన్ భరద్వాజ్ ఈ పాటను స్వరపరచడంతో పాటు నిఖితా శ్రీవల్లితో కలిసి ఆలపించారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాటలో సుధీర్‌బాబు, మాళవిక శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాత: సుమంత్ జి నాయుడు, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

