Sonakshi Sinha | బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న పెళ్లిపీటలెక్కబోతోందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోనాక్షి ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ముంబైలోని సోనాక్షి నివాసం ‘రామాయణ’ను లైట్స్‌తో అందంగా డెకొరేట్ చేశారు.
అంతేకాదు వీరి వివాహం శుక్రవారం రాత్రి మెహందీ ఫంక్షన్‌తో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్ హాజరైనట్లు బీటౌన్ మీడియా తెలిపింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి – జహీర్ ఇక్బాల్ ఫ్రెండ్ జాఫర్ అలీ మున్షీ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. చాలా ఎగ్జైటింగ్ ఉంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇందులో కుటుంబ సభ్యుల మధ్యలో కాబోయే జంట నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
The festivities are in full swing at Shatrughan Sinha’s residence, Ramayan, as it sparkles for Sonakshi Sinha and Zaheer Iqbal’s big day! ❤️💫🌟 #sonakshisinha #zaheeriqbal #bollywood #trendingreels pic.twitter.com/kIrAQPdAVX
— Viralsaala (@viralsaala) June 22, 2024
‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత ఏడాది కాలంగా ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా బహిరంగంగా బయటపెట్టలేదు. అయితే, ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే వీరి ప్రేమ బంధం నిజమని అర్థమవుతుంది. ఇక ఈ నెల ఆరంభంలో సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ కొన్ని అందమైన ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలకు ‘హ్యాపీ బర్త్‌డే సోన్జ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక వీరి పెళ్లికి స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు హీరామండి చిత్ర బృందం కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
నటుడు శత్రుఘ్న సిన్హా నటవారసురాలిగా సల్మాన్ నటించిన దబంగ్ సినిమాతో సోనాక్షి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సోనాక్షి మెరిసింది. ఈ చిత్రంలో సోనాక్షితోపాటు మనీషా కోయిరాలా, రిచా చద్ధా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అతిది రావు హైదరి నటించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
NTRNeel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నేషనల్ క్రష్.?
NBK 109 | బాలకృష్ణ ‘ఎన్బీకే 109’లో కన్నడ స్టార్ నటుడు
The GOAT Bday Shots | దళపతి విజయ్ బర్త్‌డే స్పెషల్.. ‘గోట్’ గ్లింప్స్ రిలీజ్