Fire Accident : సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ (Sri Rama Enterpises) షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో.. ఆ దుకాణంలోని సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి.
శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్‌లో మంటల్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అయితే.. మంటల ఇతర దుకాణాలకు వ్యాపిస్తుండడంతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు. అగ్నిప్రమాదం కారణంగా మోండా మార్కెట్ పరిసరాల్లో భారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.