DAO : వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud) అవినీతి అధికారులకు దొరికాడు. ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రం యజమాని నుంచి శుక్రవారం రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో DAO పట్టుబడడం కలెక్టరేట్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ఓ ఆగ్రో రైతు సేవ కేంద్రానికి యూరియాను కేటాయించేందుకు డీఈవో ఆంజనేయులు గౌడ్ డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.20 వేలు లంచంగా రూపాయలు ఇవ్వాలని అడిగి.. సదరు ఎరువుల వ్యాపారి నుంచి రూ.3 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.
డీఏవో లంచం డిమాండ్ చేసిన విషయాన్ని ఆ ఎరువుల వ్యాపారి ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. శుక్రవారం అతడు రెండో దఫాలో మరో రూ.10 వేలు ఆంజనేయులు గౌడ్‌కు ఇచ్చాడు. అనంతరం ఏసీబీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం రైడింగ్ చేసి నగదుతో దొరికిన డీఏవోను అరెస్టు చేశారు. ఆంజనేయులును శనివారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు.