IND vs SA : పొట్టి ఫార్మాట్ అంటే చాలు చెలరేగిపోయే హార్దిక్ పాండ్యా(63) అహ్మదాబాద్‌లో సునామీలా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన పాండ్యా.. మెరుపు అర్ధ శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను పాండ్యా ఊచకోత కోయగా.. తిలక్ వర్మ(73) విధ్వంసక ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓపెనర్ సంజూ శాంసన్(37) కూడా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌తో పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా(63: 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అహ్మదాబాద్‌లో చితక్కొట్టాడు. తన పవర్ హిట్టింగ్తో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించిన పాండ్యా జట్టుకు భారీ స్కోర్ అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్(37), అభిషేక్ శర్మ(34)లు శుభారంభమివ్వగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) ఎప్పటిలానే విఫలమయ్యాడు.
𝗧𝗵𝗲 𝘁𝘄𝗼 𝘄𝗲𝗿𝗲 𝗮𝗯𝘀𝗼𝗹𝘂𝘁𝗲𝗹𝘆 𝘀𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹!🔥 🔥
Drop an emoji in the comments below 🔽 to describe their innings
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#TeamIndia | #INDvSA | @TilakV9 | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/kSPbjjMPNk
— BCCI (@BCCI) December 19, 2025
సూర్య ఔటయ్యే సరికి స్కోర్ 115-3. ఆ దశలో క్రీజులోకి వచ్చిన పాండ్యా ఆలస్యం చేయకుండా ఉతుకుడే పనిగా పెట్టుకున్నాడు. లిండే, కార్బిన్ బాష్ ఓవర్లలో బౌండరీలతో రెచ్చిపోయిన 16 బంతుల్లోనే అర్ద శతకం అందుకున్నాడు. ఆ తర్వాత కూడా తనదైన విధ్వంసక ఆటతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. పాండ్యాకు జతగా తిలక్ వర్మ(73: 42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్) స్వీప్ షాట్లతో హోరెత్తించి అర్ధ శతకం బాదాడు. వీరిద్దరూ పోటీపడుతూ బౌండరీలు బాదేయగా సఫారీ బౌలర్లు నీరుగారిపోయారు. పాండ్యా, తిలక్ మెరుపులతో 17 ఓవర్లకే స్కోర్ 200 దాటింది. చివరి మూడు ఓవర్లలో 31 రన్స్ రాగా.. సఫారీలకు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙆𝙉𝙊𝘾𝙆!
Hardik Pandya is on an absolute roll here in Ahmedabad! 🙌
A 16-ball half-century – Second fastest T20I fifty for #TeamIndia cricketer (in Men’s cricket) 🔥
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#INDvSA | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/RqjfXwVsJX
— BCCI (@BCCI) December 19, 2025