Ashika ranganath | టాలీవుడ్ యాక్టర్ రవితేజ కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీలో ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆషికా రంగనాథ్ చేసిన చిట్‌చాట్‌లో ఏజ్ గ్యాప్ టాపిక్ వచ్చింది.
నాగార్జున, చిరంజీవి, కల్యాణ్ రామ్, రవితేజ లాంటి స్టార్ యాక్టర్లతో కలిసి నటిస్తూ కెరీర్లో బిజీగా మారిపోయింది కన్నడ భామ ఆషికా రంగనాథ్ . అయితే ఆషికా రంగనాథ్ నటిస్తోన్న కో యాక్టర్లంతా సీనియర్ హీరోలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొందరు హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించేటప్పుడు ఏజ్ గ్యాప్ విషయంలో అంతగా పట్టించుకోకుండా ప్రొఫెషనల్‌గా మాత్రమే ఆలోచిస్తారు. ఈ కోవలోకే వస్తుంది ఆషికా రంగనాథ్.
ఏజ్‌గ్యాప్‌పై ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనే దానిపై ఫోకస్ పెడతా. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో నా పాత్ర చాలా యంగ్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. నా సామి రంగాలో నాగార్జునతో కలిసి చాలా పరిణతి ఉన్న పాత్రలో నటించా. నేను భిన్నత్వం కోసం చూస్తా. నటుడి వయస్సుకు సంబంధించిన విషయంపై అంతగా పట్టించుకోను. నాకిచ్చిన పాత్రలో ఎలా సరిపోతా. ఆ పాత్రను సమర్థవంతంగా ఎలా పోషించి ఒప్పిస్తాననేదానిపైనే ఫోకస్ అంతా ఉంటుంది. అది యువ హీరో సినిమానా..? సీనియర్ హీరో సినిమానా..? అనేది విషయమే కాదు. కథకు నా పాత్ర ఎంతవరకు బలం ఇస్తుందనే మ్యాటర్ ఇక్కడ.. అంటూ చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.