Subrahmanyaa | నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పాపులర్ నటుడు బొమ్మాళి రవిశంకర్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కుమారుడు అద్వయ్ (Advay) సుబ్రహ్మణ్య సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే.
ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా సుబ్రహ్మణ్య గ్లింప్స్ లాంచ్ అప్డేట్ అందించారు. ఈ మూవీ గ్లింప్స్ ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ ఈవెంట్లో ప్రీమియర్ కానుంది. మరో 24 గంటల్లో ఫైర్.. అంటూ రిలీజ్ చేసిన తాజా వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇందులో అద్వయ్ స్టైలిష్ వారియర్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి రవిశంకర్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కేజీఎఫ్, సలార్ లాంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
The First Adventure of #Subrahmanyaa to begin in a First of its kind Launch ❤️🔥#SubrahmanyaaGlimpse to be premiered at the prestigious @siima Tomorrow, SEP 14th💥💥
24 HOURS TO GO 🔥🔥🔥@Ravishankar_66 @advayinaction #RubalShekawat #RaviBasrur #VigneshRaj @sandeepraaaj… pic.twitter.com/6GgNbPcXUW
— BA Raju’s Team (@baraju_SuperHit) September 13, 2024
Nandamuri Balakrishna | వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ భారీ విరాళం
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!