Subrahmanyaa | టాలీవుడ్ నటుడు బొమ్మాళి రవిశంకర్ కొడుకు అద్వయ్(Advay) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవి శంకర్ సోదరుడు నటుడు సాయి కుమార్ వారసుడిగా ఆది ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అద్వయ్ (Advay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్య’ (Subrahmanyaa). ఈ సినిమాకు బొమ్మాళి రవిశంకరే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా నేడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే.. అద్వయ్ ఫస్ట్ సినిమానే యాక్షన్ అడ్వెంచర్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒక పాడు బడిన బావిలో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి వెళతాడు అద్వయ్. అయితే ఆ రహస్యాన్ని రక్షిస్తూ.. అక్కడ విష సర్పాలు ఉండడం చూడవచ్చు. చూస్తే.. మైథాలజికల్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను 2025లో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. SG మూవీ క్రియేషన్స్, టారస్ సినీకార్ప్ బ్యానర్లపై తిరుమలరెడ్డి & అనిల్ కడియాల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read..