క్షణం, గూడఛారి, ఎవరు, మేజర్ సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అడివిశేష్ (Adivi Sesh). రీసెంట్గా శైలేష్ కొలను దర్శకత్వంలో నటించిన హిట్.. ది సెకండ్ కేస్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అడివిశేష్ ప్రస్తుతం మరో సీక్వెల్‌తో బిజీగా కాబోతున్నాడు.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూడఛారి. త్వరలోనే గూడఛారి 2 (Gudachari 2) పనులపై ఫోకస్ పెట్టబోతున్నాడు అడివిశేష్. ఈ సీక్వెల్ కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్‌తోపాటు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలుకుతాయని అడివిశేష్ ధీమాగా ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, గూడఛారి 2 కథ రాయడం మొదలుపెట్టాలనుకుంటున్నాడట అడివిశేష్ .
శశి కిరణ్ టిక్కాతో కలిసి స్క్రిప్ట్ వర్క్ షురూ చేయాలనుకుంటున్నాడట అడివిశేష్. ఫస్ట్ పార్టును డైరెక్ట్ చేసిన శశి కిరణ్ సీక్వెల్ కూడా డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. మరి గూడఛారి 2 ఏ స్థాయిలో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
మరోవైపు నాని లీడ్ రోల్లో రాబోతున్న హిట్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అడివిశేష్. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న అడివిశేష్‌తో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు రెడీగా ఉన్నా.. శేష్ మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
Read Also :Lokesh kanagaraj | క్రేజీ టాక్.. విజయ్-లోకేశ్ కనగరాజ్ సినిమా లాంఛ్ రేపే..?
Read Also :SDT 15 | SDT 15కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్.. స్టన్నింగ్ అప్డేట్ వీడియో
Read Also :Panchathantram | పంచతంత్రం ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?